amberpet: అంబర్ పేటలో టీఆర్ఎస్ చేతిలో బీజేపీ నేత కిషన్ రెడ్డి ఓటమి

  • టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశం విజయం
  • ముషీరాబాద్ లో ఓటమి అంచున లక్ష్మణ్  
  • ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలుపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అంబర్ పేట నియోజకవర్గంలో ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ వెయ్యి ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ముషీరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ కూడా ఓటమి అంచున ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి చందూలాల్ పై 18,423 ఓట్ల తేడాతో గెలుపొందారు.

amberpet
kishan reddy
TRS
kaleru venkatesam
  • Loading...

More Telugu News