Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ విజయంపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు!

  • 65 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్
  • మరో 22 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న వైనం
  • ట్విట్టర్ లో స్పందించిన మంత్రి లోకేశ్

తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను టీఆర్ఎస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ అందిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 65 స్థానాల్లో విజయం సాధించగా, మరో 22 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి కేవలం 17 స్థానాల్లో మాత్రమే గెలిచి నిరాశపరిచింది.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి శుభాకాంక్షలు’ అని తెలిపారు. కాగా, అంతకుముందు ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో విజయం సాధించిన పార్టీలకు అభినందనలు చెప్పారు.

Telangana
Mahakutami
Telangana Assembly Results
Nara Lokesh
Chandrababu
Twitter
wishes
  • Loading...

More Telugu News