Telangana: సిరిసిల్లలో టీఆర్ఎస్ హవా.. 88,886 ఓట్ల మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కేటీఆర్!

  • ప్రజాకూటమి అభ్యర్థి మహేందర్ రెడ్డి ఓటమి
  • 60 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్
  • 15 సీట్లకు పరిమితమైన ప్రజాకూటమి

తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ నేత, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఘనవిజయం సాధించారు. 88,886 ఓట్ల మెజారిటీతో కేటీఆర్ తన సమీప ప్రత్యర్థి కె.కె.మహేందర్ రెడ్డిపై విజయదుందుభి మోగించారు. తాజా ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 60 స్థానాల్లో ఇప్పటికే గెలుపొందగా, మరో 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు మహాకూటమి మాత్రం 15 స్థానాల్లో గెలుపొంది, ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Telangana
Telangana Assembly Results
sirisilla
KTR
won
Mahakutami
Congress
  • Loading...

More Telugu News