sumanth ashwin: భయపెట్టడానికి 'ప్రేమకథా చిత్రం 2' వచ్చేస్తోంది

  • హారర్ కామెడీ నేపథ్యంలో సాగే కథ 
  • భారీ రేటుకి హిందీ శాటిలైట్ హక్కులు
  • హైలైట్ గా నిలవనున్న కామెడీ    

సుధీర్ బాబు ... నందిత జంటగా 2013లో వచ్చిన 'ప్రేమకథా చిత్రం' మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ సిద్ధమైంది. సుమంత్ అశ్విన్ .. నందిత శ్వేత .. సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలుగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా ద్వారా హరికిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా ఆయన మాట్లాడుతూ .."ఈ సినిమా అవుట్ పుట్ అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఈ కారణంగానే హిందీ శాటిలైట్ .. డబ్బింగ్ హక్కులు కోటి నలభై మూడు లక్షలకి అమ్ముడయ్యాయి. ప్రభాస్ శ్రీను .. విద్యుల్లేఖ కాంబినేషన్లో వచ్చే కామెడీ హైలైట్ అవుతుంది. త్వరలోనే టీజర్ ను వదిలి .. జనవరిలో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.   

sumanth ashwin
nadita sweta
siddhi
  • Loading...

More Telugu News