Telangana: టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం.. 197 ఓట్లతో గట్టెక్కిన కొప్పుల ఈశ్వర్!

  • ధర్మపురిని దక్కించుకున్న గులాబీ పార్టీ
  • ఇప్పటికే జగిత్యాల, కోరుట్లలో ఘనవిజయం
  • 89 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న కారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తాజాగా ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ 197 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థిపై అతికష్టం మీద విజయం సాధించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల, కోరుట్ల, వర్ధన్నపేట, కంటోన్మెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం టీఆర్ఎస్ 89 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా, మహాకూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే బీజేపీ నాలుగు, మజ్లిస్ పార్టీ ఐదు, ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

Telangana
TRS
Telangana Assembly Results
dharmapuri
Koppula Eshwar
Mahakutami
  • Loading...

More Telugu News