Telangana: టీఆర్ఎస్ ఖాతాలో రెండో సీటు.. వర్దన్నపేటలో ఆరూరి రమేశ్ ఘనవిజయం!

  • మహాకూటమి అభ్యర్థి ఘోరపరాజయం
  • కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ హవా
  • సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థికి 8 వేల మెజారిటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం చేరింది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఘనవిజయం సాధించారు. మరోవైపు శేరిలింగంపల్లిలో టీడీపీ నేత, మహాకూటమి అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ పై టీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ 12,250 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే కూకట్ పల్లిలోనూ మహాకూటమి, టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ఎదురీదుతున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 8,932 ఓట్ల లీడ్ తో విజయం దిశగా దూసుకుపోతున్నారు.

Telangana
Telangana Assembly Results
vardhannapeta
  • Loading...

More Telugu News