Chandrababu: ఇంతవరకూ ఉండవల్లి నివాసాన్ని దాటని చంద్రబాబునాయుడు!

  • ప్రజా కూటమి ఘోర వైఫల్యం
  • ఇప్పటివరకూ ఫలితాలను సమీక్షించిన చంద్రబాబు
  • మరికాసేపట్లో అధికారులతో సమీక్ష

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రజా కూటమి ఘోర వైఫల్యం చెందగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచే ఇప్పటివరకూ ఫలితాల సరళిని సమీక్షించారు. కూటమి ఓటమి ఖరారైన తరువాత, ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా తన రోజువారీ కార్యక్రమాల్లోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.

మరికాసేపట్లో ఆయన అధికారులతో ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిసి పోటీ చేసినప్పటికీ ఘోర పరాభవం తప్పలేదన్న సంగతి తెలిసిందే. దాదాపు 90 స్థానాలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసే దిశగా సాగుతోంది.

Chandrababu
Undavalli
Telangana
Prajakutami
  • Loading...

More Telugu News