prajakutami: పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తున్నాం: టీ-కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క

  • ఒకవేళ సంఖ్యాబలం తగ్గితే, అందరితో మాట్లాడతాం
  • అవసరమైతే, ఎంఐఎంను కూడా సంప్రదిస్తాం
  • గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో భట్టి

పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తున్నామని టీ-కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మరోసారి ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్ ని ప్రజాకూటమి నేతలు కలిసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ సంఖ్యాబలం తగ్గితే, అందరితో మాట్లాడతామని, అవసరమైతే, ఎంఐఎంను కూడా సంప్రదిస్తామని అన్నారు. సమాచారం ఇవ్వడం కోసమే నరసింహన్ ని కలిశామని అన్నారు.

అనంతరం, టీజేఎస్ అధినేత కోదండరామ్ మాట్లాడుతూ, కూటమిని ఒక పార్టీగా పరిగణించాలని గవర్నర్ ను కోరామని చెప్పారు. గతంలో సర్కారియా కమిషన్ కూడా ఇదే విషయాన్ని సిఫార్సు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో కూటమికి సంపూర్ణ మెజార్టీ తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

prajakutami
bhatti vikramarka
mim
  • Loading...

More Telugu News