USA: స్కూల్ విద్యార్థికి నగ్నచిత్రాలు పంపిన అందాలరాణి.. అరెస్ట్ చేసిన పోలీసులు!

  • 2014లో మిస్ కెంటకీగా ఎంపికైన బియర్స్
  • 15 ఏళ్ల విద్యార్థికి నగ్నచిత్రాలు
  • విధుల నుంచి తప్పించిన పాఠశాల

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ దారితప్పింది. తన నగ్న చిత్రాలను ఓ 15 ఏళ్ల వయసున్న విద్యార్థికి పంపింది. ఈ ఫొటోలను సదరు బాలుడి తల్లిదండ్రులు గుర్తించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన అమెరికాలోని కెంటకీలో చోటుచేసుకుంది. రామ్సీ బియర్స్‌(28) అనే యువతి 2014లో కెంటకీ రాష్ట్రంలో జరిగిన అందాల పోటీల్లో మిస్ కెంటకీ కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె తాజాగా వెస్ట్‌ వర్జీనియాలోని ఆండ్రూ జాక్సన్‌ మిడిల్‌ స్కూల్‌లో పార్ట్ టైమ్ టీచర్ గా పనిచేస్తోంది.

ఈ క్రమంలో గతంలో ఇదే స్కూల్ లో చదువుకున్న ఓ విద్యార్థి(15)కి స్నాప్ చాట్ ద్వారా బియర్స్ తన నగ్నచిత్రాలను పంపింది. అయితే కుమారుడి ఫోన్ ను ఎందుకో పరిశీలించిన తల్లిదండ్రులు.. టీచర్ నగ్న ఫొటోలు ఉండటం చూసి కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిన్నారులకు అశ్లీల సమాచారం పంపినట్లు అభియోగాలు నమోదుచేసిన అధికారులు బియర్స్ ను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ గొడవ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం బియర్స్ ను సస్పెండ్ చేసింది.

USA
Kentucky
nude pics
teacher
snapechat
parents
complaint
Police
arrest
school
suspend
  • Loading...

More Telugu News