balakrishna: బాలకృష్ణ కామెడీ ఆర్టిస్ట్.. ఆయన నాకు తెలియదని చెప్పడం తప్పే!: నాగబాబు సెటైర్

  • బాలకృష్ణ మంచి నటుడు.. ఎన్టీఆర్, కృష్ణలతో కూడా నటించారు
  • చాలా కాలం క్రితమే ఆయన మరణించారు
  • బాలకృష్ణ తెలియని వారు ఎవరుంటారు?

తాను టీవీలు, యూట్యూబ్ ల వంటివి ఎక్కువగా చూడనని నాగబాబు అన్నారు. ఒక ఇంటర్వూలో బాలకృష్ణ గురించి మాట్లాడమంటే ఆయనెవరో తెలియదనేశానని... తన వ్యాఖ్యలతో కొంత మంది ఫీల్ అయ్యారని తనకు తన స్నేహితుల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని చెప్పారు. అలా అనడం తప్పుకదా, మీకు తెలియదా? అని అడిగారని తెలిపారు. బాలకృష్ణ ఎవరో తెలియదు అని అనడం నిజంగానే మిస్టేక్ అని చెప్పారు. బాలకృష్ణ తెలియని వారు ఎవరుంటారని అన్నారు. ఆయన అందరికీ తెలుసని చెప్పారు. ఆయన మంచి నటుడని, పెద్ద కమెడియన్ అని, హాస్యాన్ని అద్భుతంగా పండించగల అతి కొద్ది మంది నటుల్లో ఆయన ఒకరని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన వల్లూరి బాలకృష్ణ ఫొటోను చూపించారు. ఈయనకు 'అంజిగాడు' అనే నిక్ నేమ్ కూడా ఉందని చెప్పారు. ఆయన మరణించి చాలా కాలమయిందని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణలతో కలసి కూడా పని చేశారని చెప్పారు. ఆయనను మర్చిపోవడమనేది తాను చేసిన పెద్ద తప్పిదమని చెప్పారు. మరోవైపు, బాలయ్య ఎవరో తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్న సంగతి తెలిసిందే.

balakrishna
balayya
nagababu
tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News