Bihar: బ్రేకింగ్... కేంద్ర మంత్రి పదవికి ఉపేంద్ర కుష్వాహ రాజీనామా!

  • బీహార్ లో 7 సీట్లు డిమాండ్ చేసిన ఆర్ఎల్ఎస్పీ
  • రెండు మాత్రమే ఇస్తామన్న ఎన్డీయే
  • పదవికి రాజీనామా చేసిన ఉపేంద్ర కుష్వాహ

2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ రాష్ట్రీయ లోక్ శక్తి పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రధాని కార్యాలయానికి, లోక్ సభ స్పీకర్ కూ పంపించారు.

2014 ఎన్నికల్లో ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆర్ఎల్ఎస్పీకి మూడు స్థానాలు ఇవ్వగా, మూడింటా విజయం సాధించిన తమ పార్టీకి వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో 7 సీట్లు కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే, బీజేపీ, జేడీయూలు మాత్రం రెండు సీట్లను మాత్రమే కుష్వాహ టీమ్ కు ఇస్తామని కరాఖండీగా చెప్పేశాయి. దీనిపై గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్న కుష్వాహ, కూటమిలో తమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడంలేదని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.



Bihar
Upendra Kushahwa
Resign
  • Loading...

More Telugu News