Andhra Pradesh: చంద్రబాబు ఢిల్లీ టూర్.. వెటకారంగా స్పందించిన విజయసాయిరెడ్డి!

  • టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న బాబు
  • జాతీయ నేతలతో వ్యూహాత్మక భేటీ
  • ఫన్నీ మెమెను పోస్ట్ చేసిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసేందుకు బాబు హస్తినకు వెళ్లారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో వేర్వేరు పార్టీలను ఏకం చేయడంలో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఏపీ సీఎం భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు.

గతంలో కేంద్రంపై పోరాటం చేస్తానని వెళ్లిన చంద్రబాబు ఢిల్లీలో మోదీతో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలాగే చంద్రబాబు పార్లమెంటు మెట్లకు దండం పెడుతున్న మరో ఫొటోను పంచుకున్నారు. ఈ మెమెకు ‘గతంలో ఢీ కొట్టినప్పుడు మనం చూసిన భీకర దృశ్యాలు’ అంటూ వెటకారంగా క్యాప్షన్ ఇచ్చారు.

Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter
MEME
Chandrababu
Telugudesam
Narendra Modi
BJP
Congress
national leaders
meet
ap bhavan
  • Loading...

More Telugu News