Andhra Pradesh: లగడపాటి విజయవాడ సీటుపై కన్నేశారు.. అందుకే తప్పుడు సర్వే ఇచ్చారు!: జి.వివేక్
- ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనుకున్నారు
- ఎవరికి ఓటేయాలో ప్రజలకు బాగా తెలుసు
- శ్రీవారిని దర్శించుకున్న టీఆర్ఎస్ నేత
తప్పుడు సర్వేలతో తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రయత్నించారని టీఆర్ఎస్ నేత జి.వివేక్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి? ఎవరిని ఓడించాలి? అన్న విషయంలో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
లగడపాటి రాజగోపాల్ విజయవాడ పార్లమెంటు స్థానంపై కన్నేశారని వివేక్ తెలిపారు. అందుకోసమే మహాకూటమి(ప్రజాకూటమి)కి అనుకూలంగా తప్పుడు సర్వేలు ఇచ్చారని విమర్శించారు. త్వరలోనే కేసీఆర్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో పోల్చుకుంటే మహాకూటమి ముందంజలో ఉంటుందని లగడపాటి తన సర్వేలో ప్రకటించిన సంగతి తెలిసిందే.