Prerana Arora: బాలీవుడ్ మహిళా నిర్మాత ప్రేరణ అరోరా అరెస్ట్

  • ‘కేదారనాథ్’ హక్కుల్ని ఇప్పిస్తానని మోసం
  • రూ.32 కోట్లు తీసుకున్న ప్రేరణ
  • ప్రేరణపై పోలీసులకు ఫిర్యాదు

బాలీవుడ్ మహిళా నిర్మాత ప్రేరణ అరోరాను ముంబై ఎకనమిక్ ఆఫెన్స్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై పలువురు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. అసలు విషయంలోకి వెళితే.. తాజాగా విడుదలైన ‘కేదారనాథ్’ సినిమా హక్కుల్ని ఇప్పిస్తానని నమ్మించి విషు భగ్నానీ, పూజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నిర్మాతల నుంచి నిర్మాత ప్రేరణ అరోరా రూ.32 కోట్లు తీసుకున్నారు.

కానీ తమకు కాకుండా మరో నిర్మాత రోనీ స్క్రూవాలాకు హక్కుల్ని అప్పగించినట్టు తెలుసుకున్న విషు భగ్నానీ, పూజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నిర్మాతలు ఈ ఏడాది జూన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాము ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా పోలీసులు చర్య తీసుకోకపోవడంతో వారు ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రేరణను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Prerana Arora
Vishu Bhagnani
Puja Entertainments
Kedaranath
Mumbai
  • Loading...

More Telugu News