YSRCP: ఏపీ భవిష్యత్ కోసం వైసీపీ అధికారంలోకి రావాలి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

  • చంద్రగిరిలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’
  • ఏపీకి మేలు జరగాలంటే జగన్ నాయకత్వమే శరణ్యం
  • ఇప్పటికే ఈ రాష్ట్రం అంధకారమయమై పోయింది

ఏపీ భవిష్యత్ కోసం వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వందలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రానికి మేలు జరగాలంటే జగన్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శరణ్యమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రం అంధకారమయమై పోయిందని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఆయన అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మెగా డీఎస్సీ నిర్వహించి యాభై వేల మంది నిరుద్యోగులకు టీచర్లుగా అవకాశం కల్పించారని, కానిస్టేబుళ్ల పోస్ట్ లను భర్తీ చేశారని గుర్తుచేశారు. నేడు చంద్రబాబు పాలనలో నిరుద్యోగ సమస్య తీరలేదని, ఆయన పాలనలో నిరుద్యోగులు చాలా నష్టపోయారని విమర్శించారు.

YSRCP
Jagan
chevi reddy bhasker reddy
Chandrababu
  • Loading...

More Telugu News