Akshay Kumar: నా పిల్లల్ని మాత్రం ఫోటోలు తీయించను: అక్షయ్ కుమార్

  • కెమెరా ముందుకు తీసుకురాను
  • పిల్లలకు డబ్బు విలువ తెలియాలి
  • పనిగట్టుకుని ఫోటోలు తీయించను

సాధారణంగా సెలబ్రిటీలతో పాటు వారి పిల్లలకు కూడా అదే రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. వారు కూడా తమ పిల్లలతో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. అయితే బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ మాత్రం దీనికి విరుద్ధమట. తను ఎప్పటికీ తన పిల్లలను కెమెరా ముందుకు తీసుకురానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ తెలిపారు.

కారణం లేకుండా ఫోటోలు తీయిస్తే పిల్లల్లో ఒకరకమైన నిర్లక్ష్యం పెరుగుతుందని ఆయన తెలిపారు. అయితే పిల్లలు ఏవైనా మంచి పనులు చేసినపుడు మాత్రం ఫోటోలు తీస్తే వాటిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని వెల్లడించారు. అలాగే పిల్లలకు డబ్బు విలువ కూడా తెలిసిరావాలని అక్షయ్ పేర్కొన్నారు. తను మాత్రం ఎవరైనా అడిగితే ఫోటోకు పోజిస్తానని అక్షయ్ తెలిపారు. తన పిల్లలు బయటకు వచ్చినపుడు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తే అభ్యంతరం లేదని.. కానీ పనిగట్టుకుని మాత్రం ఫోటోగ్రాఫర్లను పిలిపించి పిల్లల ఫోటోలను తీయించనని అక్షయ్ స్పష్టం చేశారు.

Akshay Kumar
Photos
Photographers
children
  • Loading...

More Telugu News