medchel: ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేశాం: మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి

  • ఈ నెల 11న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు  
  • స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 7న ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 11వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి ఎంవీ రెడ్డి మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కార్యక్రమం హోలీ మేరీ కళాశాలలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను అనుసరించి ఫలితాలు వెల్లడయ్యే సమయం ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాలతో ఇరవై నాలుగు గంటలూ నిఘా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, వారి ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

medchel
mv reddy
vote counting
Telangana
  • Loading...

More Telugu News