keerthi suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కీర్తి 
  • రజనీ చిత్రానికి అనిరుధ్ సంగీతం 
  • మరో హిందీ చిత్రంలో దుల్కర్

*  'మహానటి' చిత్రంతో ఎంతో పేరు తెచ్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్ తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
*  తాజాగా 'రోబో' సీక్వెల్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని మురుగదాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. మార్చి నుంచి షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తాడు.
*  హిందీలో కూడా సినిమాలు చేస్తున్న మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా కరణ్ జొహార్ సినిమాలో నటించడానికి ఎంపికయ్యాడు. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా కరణ్ నిర్మిస్తున్న బయోపిక్ లో దుల్కర్ హీరోగా నటించనున్నాడు.

keerthi suresh
rajanikanth
murugadas
dulkar salman
  • Loading...

More Telugu News