mohanlal: అదరగొట్టేస్తోన్న 'ఒడియన్' తెలుగు టీజర్

  • 'ఒడియన్' గా మోహన్ లాల్
  • విభిన్నమైన కథాకథనాలు  
  • వివిధ భాషల్లో విడుదల  

విభిన్నమైన కథలను ఎంచుకోవడంలోనూ .. విలక్షణమైన పాత్రలను పోషించడంలోను మోహన్ లాల్ ఎప్పుడూ ముందే వుంటారు. ఆయన తాజా చిత్రంగా 'ఒడియన్' నిర్మితమైంది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు.

సస్పెన్స్ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. 'ఒడియన్ .. వాడు చీకటి రాజ్యానికి రారాజు' అనే డైలాగ్, 'ఇంతవరకూ నువ్వు నన్ను ఎన్నో రూపాల్లో చూసుంటావు .. నువ్వు చూడని రూపం ఒకటుంది' అనే మోహన్ లాల్ డైలాగ్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా వున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా మంజు వారియర్ కనిపించనుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ 8 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. 

mohanlal
manju
  • Error fetching data: Network response was not ok

More Telugu News