Andhra Pradesh: టీడీపీ నేత ‘మాగుంట’ కంపెనీలపై ఐటీ దాడులు.. రూ.55 కోట్ల నగదు, భారీగా బంగారం స్వాధీనం!

  • మాగుంట బాలాజీ గ్రూప్ లో ఐటీ తనిఖీలు
  • చెన్నైలోని ఆఫీసులు, ఇళ్లలో సోదాలు
  • పన్ను ఎగవేత నేపథ్యంలోనే దాడులు

టీడీపీ ఎమ్మెల్సీ, పార్లమెంటు మాజీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన ‘మాగుంట బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’పై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) ఈరోజు దాడులు నిర్వహించింది. చెన్నైలోని శ్రీనివాసులు రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాల్లో ఐటీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ దాడుల్లో భాగంగా రూ.55 కోట్ల నగదుతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పొందిన కాంట్రాక్టులు, చెల్లించిన పన్ను మధ్య వ్యత్యాసం ఉండటంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించాయి. దాడుల నేపథ్యంలో ఆఫీసులో కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్ లు, డిస్క్ లను ఐటీ అధికారులు జప్తు చేశారు. ప్రస్తుతం మిగిలిన ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.

Andhra Pradesh
Tamilnadu
chennai
magunta comapnies
IT raidas
55 crore cash
gold
seize
  • Loading...

More Telugu News