Australia: విజయానికి పునాది... ఆస్ట్రేలియాపై 100 దాటిన లీడ్!
- అడిలైడ్ లో జరుగుతున్న మూడో రోజు ఆట
- 44 పరుగులతో రాణించిన మురళీ విజయ్
- ఆచితూచి ఆడుతున్న పుజారా, కోహ్లీ
- భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 97, లీడ్ 112
అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో విజయానికి పునాది వేసుకునే దిశగా భారత్ సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 15 పరుగుల ఆధిక్యాన్ని పొందిన భారత ఆటగాళ్లు, రెండో ఇన్నింగ్స్ లో నిదానంగా సాగుతూ స్కోరును ముందుకు తీసుకెళుతున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ స్కోరును సాధించకపోయినప్పటికీ, క్లిష్టమైన ఆసీస్ పిచ్ లపై చెప్పుకోతగ్గ స్కోరు అనిపించుకునేలా 44 పరుగులతో రాణించాడు.
ఇక మురళీ విజయ్ మరోసారి నిరాశపరుస్తూ 18 పరుగులకే పెవీలియన్ చేరాడు. ఆపై వచ్చిన పుజారా, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం భారత స్కోరు రెండు వికెట్ల నష్టానికి 97 పరుగులు కాగా, పుజారా 15, కోహ్లీ 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ పై 112 పరుగుల లీడ్ ఉంది. ఆట మరో రెండు రోజులు మిగిలివుండటంతో ఇంకో 200 పరుగులు చేస్తే, విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టేనని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.