Telangana: తాను చెప్పిన పార్టీకి ఓటేయని భార్య.. కత్తితో వెంటపడి చేతి వేలును నరికిన భర్త!

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
  • భార్యాభర్తల మధ్య అసెంబ్లీ ఎన్నికల చిచ్చు
  • కేసు నమోదు చేయని పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఓ జంట కాపురంలో చిచ్చుపెట్టాయి. తాను చెప్పిన పార్టీకి ఓటేయలేదని ఆగ్రహానికి లోనయిన ఓ వ్యక్తి తన భార్య చేతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె చిటికెన వేలు తెగిపడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలంలో చోటుచేసుకుంది.

జిల్లాలోని సర్వాయిపేటలో ఉంటున్న ఓ జంట ఎన్నికల సందర్భంగా ఓ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకుంది. ఓటింగ్ పూర్తయ్యాక ఆమె తొలుత అంగీకరించిన పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటేసినట్లు తెలుసుకున్న సదరు భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నేను చెప్పిన పార్టీకి కాకుండా ఇంకో పార్టీకి ఓటేస్తావా’ అంటూ కత్తితో ఆమెపై దాడిచేశాడు.

దీంతో బాధితురాలు చేతిని అడ్డంగా పెట్టడంతో చిటికెన వేలు తెగిపోయి నేలపై పడిపోయింది. ఈ సందర్భంగా బాధితురాలి హాహాకారాలు విన్న స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదనీ, ఒకవేళ బాధితురాలు ఫిర్యాదు చేస్తే కేసు నమోదుచేస్తామని ఎస్సై తిరుపతి తెలిపారు.

Telangana
Jayashankar Bhupalpally District
husband
attacked
wife
not voting
for
finger cut]
knife
attack
  • Loading...

More Telugu News