Khammam District: మరణంలోనూ నీవెంటే!: భార్య చనిపోయిన కాసేపటికే మృతి చెందిన భర్త

  • గుండెపోటు రావడంతో అంతిమ శ్వాస
  • ఖమ్మం జిల్లా పందిళ్ల గ్రామంలో ఘటన
  • చింతకాని సొసైటీ అధ్యక్షురాలిగా పనిచేసిన కౌసల్య

పెళ్లి పీటలపై ఓ యువతి మెడలో తాళికట్టి ‘నాతి చరామి..’ అంటూ చేసిన ప్రమాణాన్ని నిజం చేస్తూ చావులోనూ అతను భార్యకు తోడుగానే వెళ్లాడు. జీవిత భాగస్వామి మృతి చెందిన కాసేపటికీ అతనూ కన్నుమూశాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

మండల పరిధిలోని పందిళ్ల గ్రామానికి చెందిన దేవరపల్లి బ్రహ్మానందరెడ్డి (75), కౌసల్య (67) దంపతులు. కౌసల్య నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున ఆమె మృతి చెందింది. భార్య మృతిని జీర్ణించుకోలేని బ్రహ్మానందరెడ్డికి కాసేపటికే గుండె పోటు రావడంతో తనూ కన్నుమూశాడు. దంపతులు ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కౌసల్య చింతకాని సొసైటీ అధ్యక్షురాలిగా పనిచేశారు.

Khammam District
chinthakani mandal
wife and husbend died
  • Loading...

More Telugu News