Telangana: తెలంగాణలో ఎన్నికలు.. వెలవెలబోయిన ఏపీ సచివాలయం

  • హైదరాబాద్‌లో వేలాదిమంది ఏపీ ఉద్యోగులు
  • ఓటు హక్కు మార్చుకోని వైనం
  • ఖాళీగా దర్శనమిచ్చిన మంత్రుల పేషీలు

తెలంగాణలో ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని సచివాలయం ఉద్యోగులు లేక బోసిపోయింది. నిత్యం కళకళలాడుతూ కనిపించే రోడ్డు, బ్లాకులు, పార్కింగ్ ప్రదేశాలు ఖాళీగా వెలవెలబోతూ కనిపించాయి. ఉద్యోగులందరూ ఓటు వేసేందుకు హైదరాబాద్ తరలి వెళ్లడంతో ఈ పరిస్థితి కనిపించింది. ఉద్యోగులు మాత్రమే కాదు.. మంత్రులు, ఉన్నతాధికారుల పేషీలు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి.

రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణలోని ఏపీ ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. దీంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న చాలామంది ఉద్యోగులు అమరావతికి తరలివచ్చారు. అయితే, ఇప్పటికీ వందలాదిమంది ఉద్యోగులు నిత్యం హైదరాబాద్ నుంచి విధులకు హాజరవుతున్నారు. దీంతో వారి ఓటు హక్కు హైదరాబాద్‌లోనే నమోదై ఉంది. దీంతో వారందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లడంతో అమరావతి సచివాలయం బోసిపోయి కనిపించింది.

  • Loading...

More Telugu News