lagadapati: ఎన్నికలపై రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిల ప్రభావం ఉంది: లగడపాటి

  • నాకు హరీష్ అయినా, రేవంత్ అయినా ఒకటే
  • పెద్ద నాయకులు ఓడిపోయే అవకాశం లేదు
  • హైదరాబాదులో రెండు చోట్ల ఓట్లు ఉన్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది

తనకు ఏ పార్టీపై, ఏ నాయకుడిపై ప్రత్యేకమైన అభిమానం లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. తన కుటుంబసభ్యులు కూడా వివిధ పార్టీలకు ఓటు వేశారని చెప్పారు. తనకు మంత్రి హరీష్ రావు అయినా, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అయినా ఒకటేనని అన్నారు. జిల్లాల్లో 80 శాతం మహాకూటమికే ఆధిక్యత వస్తుందని చెప్పారు.

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిలను అరెస్ట్ చేయడం కూడా టీఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని చెప్పారు. పోలింగ్ సమయంలో జరిగిన కొన్ని ఘటనలు కూడా ప్రభావం చూపాయని అన్నారు. ఒకరిద్దరు తప్ప పెద్ద నాయకులు ఎవరూ ఓడిపోయే అవకాశం లేదని తెలిపారు. జనాలు సొంత ఊళ్లకు వెళ్లడం వల్లే హైదరాబాదులో పోలింగ్ శాతం తగ్గిందని తెలిపారు. హైదరాబాదులో రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని... ఇలాంటి డూప్లికేట్ ఓటర్లను గుర్తించడం చాలా కష్టమని చెప్పారు.

lagadapati
Revanth Reddy
jaggareddy
harish rao
  • Loading...

More Telugu News