Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో భారీగా పుంజుకున్న కాంగ్రెస్: ఇండియా టుడే- యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్

  • ఏ పార్టీకి పట్టం కట్టని ఓటర్లు
  • కాంగ్రెస్ కు 104 నుంచి 122 స్థానాలు
  • బీజేపీకి 102 నుంచి 102 స్థానాలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ఏ పార్టీకి ఓటర్లు పట్టం కట్టలేదని ఇండియా టుడే - యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 102 నుంచి 120 వరకు స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ 104 నుంచి 122 వరకు గెలుపొందుతుందని చెప్పింది. ఓవరాల్ గా కాంగ్రెస్ కు స్వల్ప మెజార్టీని చూపించింది. బీఎస్పీకి 1 నుంచి 3 స్థానాలు దక్కుతాయని తెలిపింది. ఇతరులు 3 నుంచి 8 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని చెప్పింది.

గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ 55 స్థానాలను అధికంగా గెలవబోతోందని... ఇదే సమయంలో బీజేపీ 54 స్థానాలను కోల్పోనుందని తెలిపింది.

Madhya Pradesh
india today
exit polls
  • Loading...

More Telugu News