nitin gadkari: ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాను: నితిన్ గడ్కరీ

  • ఆక్సిజన్ అందక ఇబ్బందికి గురయ్యాను
  • ఆ తర్వాత షుగర్, బీపీ లెవెల్స్ పడిపోయాయి
  • నేను కోలుకోవాలని కోరుకున్న అందరికీ కృతజ్ఞతలు

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రూహరిలో ఈ రోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వేదికపైనే సొమ్మసిల్లి పడిపోయారు. ఆ సమయంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు కూడా అక్కడే ఉన్నారు. అస్వస్థతకు గురైన గడ్కరీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

చికిత్స అనంతరం గడ్కరీ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని... ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో ఇబ్బందికి గురయ్యానని చెప్పారు. ఆ తర్వాత షుగర్, బీపీ లెవెల్స్ పడిపోవడం వల్ల అస్వస్థతకు గురయ్యానని... ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగానే ఉన్నానని చెప్పారు. తాను కోలుకోవాలని కోరుకున్న శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

nitin gadkari
ill
health
  • Loading...

More Telugu News