polling officer: వృద్ధ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్న పోలింగ్ అధికారి... చితగ్గొట్టిన స్థానికులు
- సూర్యాపేట జిల్లా వెళ్లటూరు గ్రామంలో అక్రమార్కుడు
- వృద్ధుల బదులు సొంతంగా ఓటు వేస్తున్న అధికారి
- బుద్ధి చెప్పిన స్థానికులు
ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు చెప్పినట్టు కాకుండా, సొంతంగా తనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తున్న పోలింగ్ అధికారిని స్థానికులు చితకబాదారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వెళ్లటూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 139వ నంబర్ బూత్ లో ఉన్న ఆ అధికారి సొంతంగా ఓటు వేస్తున్నట్టు గుర్తించి, బుద్ధి చెప్పారు. ఓటు ఎలా వేయాలో చెబుతానని, వారి బదులు అధికారులే ఓటు వేస్తున్నారని పలుచోట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి.