Motkupalli Narsimhulu: మోత్కుపల్లి పరిస్థితి ఆందోళనకరం... హైదరాబాద్ కు తరలింపు!

  • ఈ ఉదయం అస్వస్థతకు గురైన మోత్కుపల్లి
  • ఛాతీలో నొప్పి, వాంతులతో ఇబ్బందులు
  • అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో హైదరాబాద్ కు
  • సుప్రజ ఆసుపత్రిలో చికిత్స

శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆలేరు బీఎల్ఎఫ్ అభ్యర్థి, మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

భువనగిరి ఏరియా ఆసుపత్రికి సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో, కుటుంబీకులు సొంత వాహనంలోనే ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. లో-బీపీతో పాటు ఛాతీలో విపరీతమైన నొప్పి, వాంతులు వచ్చాయని తెలుస్తోంది. దీంతో మోత్కుపల్లి అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Motkupalli Narsimhulu
Heart Pain
Ambulence
Hospital
Hyderabad
  • Loading...

More Telugu News