Uttam Kumar Reddy: ప్రజాకూటమి నేతలపై దాడులు దారుణం...ఇది ఓటమి భయమే!: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

  • ఓటర్ల దృష్టిని మరల్చే ప్రయత్నం ఇది
  • టీఆర్‌ఎస్‌, బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షుడు
  • ప్రశాంత పోలింగ్‌కు ఈసీ చర్యలు తీసుకోవాలని వినతి

తెలంగాణ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో మహాకూటమి నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. ఓడిపోతామన్న భయంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా దాడులకు పాల్పడుతున్నారని, ఇది దారుణమని వ్యాఖ్యానించారు. ఓటర్ల దృష్టిమరల్చి లబ్ధిపొందాలన్న ఆలోచన ఇందులో ఉందన్నారు. తక్షణం ఎన్నికల కమిషన్‌ ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని, ప్రశాంతంగా, పారదర్శకంగా పోలింగ్‌ జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Uttam Kumar Reddy
fires on TRS bjp
  • Loading...

More Telugu News