NTR: అక్క సుహాసిని గెలవాలి: ఎన్టీఆర్

  • కుటుంబీకులతో వచ్చి ఓటేసిన ఎన్టీఆర్
  • ఓటు వేయకుంటే ఫిర్యాదు చేసే హక్కు లేదు
  • ఓటర్లతో సెల్ఫీలు దిగిన ఎన్టీఆర్

కూకట్ పల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తన సోదరి నందమూరి సుహాసిని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఈ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలసి పోలింగ్ బూత్ నకు వచ్చి ఓటేసిన ఆయన మీడియాతో మాట్లాడారు.

"రాజ్యాంగం, దేశం మనకు కల్పించిన హక్కు ఇది. ఆ హక్కును అందరూ వినియోగించుకోవాలి. ఓటు వేయకుంటే కంప్లయింట్ చేసే హక్కు లేదు. ఓటు వేయాలనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు. మనసా, వాచా, కర్మణా మనకు అనిపించాలి. నేను చెప్పాల్సింది ఒక్కటే. అక్క గెలవాలని మాత్రం కోరుకుంటున్నా" అని ఆయన అన్నారు. తనతో పాటు క్యూలైన్లో వేచివున్న పలువురు ఓటర్లు సెల్ఫీలు అడుగుతుంటే, ఎన్టీఆర్ వారిని ఉత్సాహంగా పలకరిస్తూ ముందుకు సాగారు.

NTR
Vote
Suhasini
  • Loading...

More Telugu News