Mukesh Ambani: కుమార్తె పెళ్లి ఏర్పాట్లను అన్నీ తానై చూసుకుంటున్న ముకేశ్ అంబానీ!

  • ఉదయ్‌పూర్‌లో ఒక్కటి కానున్న ఈశా-ఆనంద్
  • 50 చార్టెడ్ విమానాలు, 1000 విలాసవంతమైన కార్లను రెడీగా ఉంచిన ముకేశ్
  • సర్వాంగ సుందరంగా ముస్తాబైన నగరం

కుమార్తె ఈశా అంబానీ పెళ్లి కోసం ముకేశ్-నీతా అంబానీలు రంగంలోకి దిగారు. పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. దేశవిదేశాల నుంచి అతిరథ మహారథులు పెళ్లికి హాజరవుతుండడంతో వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు. పెళ్లి జరగనున్న ఉదయ్‌పూర్‌కు చేరుకున్న ముకేశ్ దంపతులు ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటూ అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. వధువు ఈశా అంబానీ కోసం దుస్తులు డిజైన్ చేసిన బాలీవుడ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా కూడా ఉదయ్‌పూర్ చేరుకున్నారు. పెళ్లికి వేదిక కానున్న హోటల్ ఒబెరాయ్ ఉదయ్ విలాస్, సిటీ ప్యాలెస్‌లను విద్యుద్దీపాలతో అలంకరించారు.  

ఇక, పెళ్లికి హాజరుకానున్న విదేశీ ప్రముఖుల కోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తున్న ముకేశ్ వారిని ఉదయ్‌పూర్ తీసుకొచ్చేందుకు 50 వరకు చార్టెడ్ విమానాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో వీరి కోసం ఏకంగా వెయ్యి విలాసవంతమైన కార్లను సిద్ధంగా ఉంచారట. శని, ఆదివారాల్లో జరగనున్న ఈశా-ఆనంద్ పెళ్లి వేడుకను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు.

కాగా, ఈశా-ఆనంద్ పెళ్లి నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో సందడి మొదలైంది. నగరంలోని హోటళ్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఈశా-ఆనంద్ పెళ్లికి పలువురు ప్రముఖులు తరలి వస్తుండడంతో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

Mukesh Ambani
esha ambani
Anand
Udaypur
nita ambani
  • Loading...

More Telugu News