TV actress: ‘మీటూ’ ఆరోపణలు చేసి ఇరుక్కుపోయిన నటి.. ఆరోపణలు తప్పని తేల్చేసిన పోలీసులు!

  • సుభాష్ ఘయ్ తనపై అత్యాచారానికి పాల్పడబోయాడంటూ ఫిర్యాదు
  • ఒక్కరాత్రి గడిపితే సినిమా అవకాశాలు ఇప్పిస్తానన్నాడని ఆరోపణ
  • ఆరోపణలు నిజం కాదని తేల్చేసిన పోలీసులు

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ నటి, మోడల్ కేట్ శర్మ చేసిన ఆరోపణలు తప్పని పోలీసులు తేల్చేశారు. తనను ఇంటికి పిలిచిన సుభాష్ ఘయ్ అక్కడ చాలామంది ఉండగానే మసాజ్ చేయమని అడిగారని పేర్కొంది. తాను కాదనలేక రెండు మూడు నిమిషాలు చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్తే ఆయన తన వెనకాలే వచ్చారని తెలిపింది.

అక్కడ తనను పట్టుకుని తనతో ఒకరాత్రి గడిపితే సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని చెబుతూ తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపించింది. అంతేకాదు, సినిమా డిస్కషన్ పేరుతో తనను బెడ్రూములోకి తీసుకెళ్లాడని, మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా తనను దగ్గరకు తీసుకుని లిప్ కిస్ పెట్టబోయాడని ఆరోపిస్తూ ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేట్ శర్మ ఆరోపణలపై విచారణ ప్రారంభించారు. నటి ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, సుభాష్ ఘయ్‌పై ఆమె చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చారు. అంతేకాదు, ఆరోపణల్లో పసలేదని తేలిపోవడంతో తన తల్లి ఆరోగ్యం బాగాలేదన్న సాకుతో దర్శకుడిపై పెట్టిన కేసును ఆమె వెనక్కి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా, సుభాష్ ఘయ్ స్పందిస్తూ తనపై లేనిపోని ఆరోపణలు చేసి తన ప్రతిష్ఠను బజారుకు ఈడ్చేందుకు ప్రయత్నించిన కేట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

TV actress
kate sharma
molestation
Bollywood
Subhash Ghai
  • Loading...

More Telugu News