Congress: మల్ రెడ్డికే ఓటేయండి.. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం

  • ఇబ్రహీంపట్నం బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి మద్దతు
  • బరిలో టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి
  • కార్యకర్తలు మల్‌రెడ్డికే ప్రచారం చేస్తుండడంతో దిగొచ్చిన కాంగ్రెస్

పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇబ్రహీంపట్నం సీటు కోసం చివరి వరకు ప్రయత్నించి ఫలితం లేకపోవడంతో బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన మల్‌రెడ్డి రంగారెడ్డికే మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ టికెట్‌ను టీడీపీకి కేటాయించారు. ఆ పార్టీ తరపున సామ రంగారెడ్డి బరిలో ఉన్నారు.

అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం కూటమి ఒప్పందానికి విరుద్ధంగా మల్‌రెడ్డి రంగారెడ్డికే పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తుండడంతో కాంగ్రెస్ దిగిరాక తప్పలేదు. ఆయనకే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటర్లలో నెలకొన్న గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Congress
Telangana
Malreddy Rangareddy
Sama Rangareddy
Uttam Kumar Reddy
  • Loading...

More Telugu News