Anjan Kumar: ఎన్నికల వేళ పాతబస్తీలో పట్టుబడ్డ లోడెడ్ తుపాకీ

  • ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్
  • ఇంటిని తాకట్టు పెట్టి అప్పు
  • కోర్టును ఆశ్రయించిన అశోక్
  • ఉత్తరప్రదేశ్ వెళ్లి రివాల్వర్ కొనుగోలు

మరికొన్ని గంటల్లో తెలంగాణలో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీలో లోడ్ చేసి ఉన్న తుపాకి పట్టుబడటం సంచలనం రేపుతోంది. సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న మావోయిస్టు సానుభూతిపరుడు ఓదెల శ్రీనివాస్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన ఇంటిని తాకట్టు పెట్టి శ్రీనివాస్.. అశోక్ అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నాడు.

అయితే తీసుకున్న అప్పు ఎంతకీ తీర్చకపోవడంతో అశోక్ కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అశోక్‌పై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ అతన్ని హతమార్చేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లి రివాల్వర్ కొనుగోలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పటి వరకు 4,587 లైసెన్స్‌డ్ రివాల్వర్‌లను స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు.

Anjan Kumar
Ashok
Srinivas
Gun
Old City
Telangana
  • Loading...

More Telugu News