ys jagan: ఆయన ‘కాకా' వెంకట్రావు, కమీషన్ల రావు’: వైఎస్ జగన్ విమర్శలు

  • ప్రజల కోసం కళా వెంకట్రావు ఒక్క మంచి పనీ చేయలా
  • చంద్రబాబుని మాత్రం ఆయన బాగా కాకా పడతారు
  • కోట్ల రూపాయల భూములను కొట్టేశారు

నాలుగున్నరేళ్లుగా ఈ నియోజకవర్గంలో కష్టాలే చూస్తున్నామని ప్రజలు తన వద్ద వాపోయారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన మాట్లాడుతూ, ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కళా వెంకట్రావు ప్రజల కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదని ప్రజలు అంటున్నారని విమర్శించారు.

ప్రజల కోసం ఏ ఒక్క మంచి పనీ చేయని కళా వెంకట్రావు.. చంద్రబాబునాయుడిని  మాత్రం బాగా కాకా పడతారని, కళా వెంకట్రావును కమీషన్ల రావు అని ప్రజలు అంటున్నారని, కోట్ల రూపాయల భూములను కొట్టేశారని ఆరోపించారు. నాడు వైఎస్ హయాంలో ఇక్కడ అంబేద్కర్ యూనివర్శిటీ వచ్చిందని, ఈ యూనివర్శిటీలో పోస్టులు భర్తీ చేయరని, 16 మంది అధ్యాపకులకుగాను 12 మందే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే 34 ప్రభుత్వ పాఠశాలలను మూసేయించారని ప్రజలు చెబుతున్నారని అన్నారు.

ys jagan
kala venkata rao
srikakulam
chilakapalem
  • Loading...

More Telugu News