cvc: సీబీఐ చీఫ్ పై ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు సీవీసీని ఎందుకు సంప్రదించలేదు?: కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

  • అలోక్ వర్మ పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు
  • ఉన్నపళంగా వాళ్లిద్దరినీ సెలవుపై ఎలా పంపించారు?
  • ఈ పరిణామాలు రాత్రికి రాత్రే జరగలేదన్న సుప్రీంకోర్టు

సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాజేష్ ఆస్థానాలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చర్యలు తీసుకోవడానికి ఏర్పడిన పరిణామాలు రాత్రికి రాత్రే జరగలేదని, వాళ్లిద్దరినీ ఉన్నపళంగా సెలవుపై ఎలా పంపించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తనను కేంద్రం సెలవుపై పంపించడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

 గత జులై నుంచి వాళ్లని భరిస్తున్నామని చెప్పారు కదా, మరి, అకస్మాత్తుగా వారిని సెలవుపై ఎందుకు పంపించాల్సి వచ్చిందని, సీబీఐ చీఫ్ పై ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు సీవీసీని ఎందుకు సంప్రదించలేదని సుప్రీం ప్రశ్నించింది. కాగా, సీబీఐ కేసుల దర్యాప్తునకు బదులుగా వారే ఒకరిపై ఒకరు దర్యాప్తు చేసుకుంటున్నారని సుప్రీంకోర్టుకు సీవీసీ వెల్లడించింది. సీబీఐ అంశంపై తాము దర్యాప్తు చేపట్టామని, అయితే, కొన్ని నెలలుగా సంబంధిత దస్త్రాలను అలోక్ వర్మ తమకు ఇవ్వలేదని కోర్టుకు సీవీసీ తెలిపింది.

  • Loading...

More Telugu News