Tollywood: మహేశ్ బాబు అడుగుజాడల్లో అల్లు అర్జున్.. సత్యం థియేటర్ పై కన్నేసిన స్టైలిష్ స్టార్!

  • ఏఎంబీ సినిమాస్ ప్రారంభించిన మహేశ్
  • మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగనున్న బన్నీ
  • సంబంధిత వర్గాలతో కొనసాగుతున్న చర్చలు

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల తన సొంత మల్టిప్లెక్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ భాగస్వామ్యంతో మహేశ్ ఈ ప్రాజెక్టును చేపట్టాడు. ‘ఏఎంబీ సినిమాస్’ పేరుతో నిర్మించిన ఈ  మల్టిప్లెక్స్ కు అన్నివర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆయన బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. మల్టిప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు బన్నీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

అమీర్ పేట వద్ద ఉన్న సత్యం థియేటర్ స్థానంలో మల్టిప్లెక్స్ కట్టేందుకు బన్నీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే బంజారాహిల్స్ లోని సిటీ సెంటర్ లోనూ మల్టిప్లెక్స్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించాయి. అయితే ఈ విషయమై అల్లు అర్జున్, ఆయన టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత బన్నీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు సైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఇంకా త్రివిక్రమ్, బన్నీ స్పందించలేదు.

Tollywood
Mahesh Babu
amb theatre
Allu Arjun
bunny
satyam theatre
city centre
multiplex
business
  • Loading...

More Telugu News