manju warrior: షూటింగ్ లో ప్రమాదం.. మంజూ వారియర్ నుదుటికి గాయం!

  • 'జాక్ అండ్ జిల్' సినిమా షూటింగ్ లో ప్రమాదం
  • గాయానికి కుట్లు వేసినట్టు సమాచారం
  • కొన్నాళ్లు విశ్రాంతి 

ప్రముఖ మలయాళ నటి మంజూ వారియర్ షూటింగులో జరిగిన ప్రమాదంలో గాయపడింది. మల్లువుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సంతోష్ శివన్ ప్రస్తుతం 'జాక్ అండ్ జిల్' అనే సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నప్పుడు మంజూ వారియర్ నుదుటికి గాయం అయింది. యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె గాయానికి కుట్లు వేసినట్టు సమాచారం. మంజూ కోలుకున్న వెంటనే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ సినిమాలో మంజూకు జోడీగా హీరో జయరాం నటిస్తున్నాడు.

manju warrior
jack and jill
santhosh sivan
malluwood
injury
  • Loading...

More Telugu News