navjoth singh sidhu: సిద్ధూ ఆగ్రాకు వస్తే తల నరికేస్తాం: హిందూ యువవాహిని వార్నింగ్

  • యోగిపై సిద్ధూ అవాకులు, చెవాకులు పేలారు
  • సిద్ధూ తలను తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తాం
  • పాక్ కు అనుకూలంగా మాట్లాడే సిద్ధూకు.. భారత్ లో ఉండే అర్హత లేదు

పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై హిందూ యువవాహిని సంచలన ఆరోపణలు చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై సిద్ధూ అవాకులు, చెవాకులు పేలారని... ఆయన తలను నరికి తీసుకొచ్చిన వారికి కోటి రూపాయలను నజరానాగా ఇస్తామని తెలిపింది.

హిందూ యువవాహిని ఆగ్రా విభాగం అధ్యక్షుడు తరుణ్ సింగ్ మాట్లాడుతూ, సిద్ధూ ఆగ్రాకు వస్తే తల నరికేస్తామని హెచ్చరించారు. పాకిస్థాన్ కు అనుకూలంగా సిద్ధూ ప్రతిసారి మాట్లాడుతున్నారని... ఆయనకు భారత్ లో ఉండే అర్హత కూడా లేదని అన్నారు. సిద్ధూను తామే పాకిస్థాన్ కు పంపించేస్తామని చెప్పారు.

ఆదివారం రాజస్థాన్ లో జరిగిన ఓ ర్యాలీలో సిద్ధూ ప్రసంగిస్తూ, మోదీ ఒక దొంగ అని, యోగి ఒక భోగి అని అన్నారు. బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. చౌకీదారు కుక్క కూడా విశ్వాసాన్ని కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే, సిద్ధూకు వ్యతిరేకంగా హిందూ యువవాహిని ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలను చేపడుతున్నారు. 

navjoth singh sidhu
modi
yogi adityanath
tarun singh
hindu Yuva vahini
agra
  • Loading...

More Telugu News