konda surekha: కొండా సురేఖపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చల్లా ధర్మారెడ్డి

  • రౌడీయిజం, గూండాయిజంతో డబ్బులు సంపాదించుకుంటారు
  • అవసరానికి తగ్గట్టు కాళ్లు కూడా పట్టుకుంటారు
  • నేను ఏ ఒక్కరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు

అసలు నీవు ఒక మహిళవేనా? అంటూ కొండా సురేఖపై టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న పరకాలలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, రౌడీయిజం, గూండాయిజంతో కొండా దంపతులు డబ్బులు సంపాదించుకుంటారని అన్నారు. అవసరానికి తగ్గట్టుగా కాళ్లు పట్టుకుంటారని, లేదంటే రౌడీయిజం చూపిస్తారని విమర్శించారు. తాను ఏ ఒక్కరి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, కుటుంబసభ్యుల కష్టంతోనే బతుకుతున్నామని చెప్పారు. పరకాల ఓటర్లు ఇచ్చే తీర్పు రాష్ట్రంలోనే ఒక ప్రభంజనం సృష్టించాలని అన్నారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబును కాంగ్రెస్ నేతలు మళ్లీ తీసుకొచ్చారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రచారానికి చంద్రబాబే పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. ఢిల్లీ నుంచి విమానాల్లో వచ్చి ప్రచారం చేసే నేతలు మనకు అవసరం లేదని చెప్పారు. 

konda surekha
challa dharma reddy
parakala
congress
TRS
  • Loading...

More Telugu News