Sattupalli: తెలంగాణ ఎన్నికల్లో బాగా కష్టపడ్డావ్... ఏపీ ఎమ్మెల్యేకు చంద్రబాబు అభినందన!

  • సత్తుపల్లి ఇన్ చార్జ్ గా గురజాల ఎమ్మెల్యే యరపతినేని
  • క్షేత్రస్థాయిలో వ్యూహాలు ఫలించాయన్న చంద్రబాబు
  • భుజంపై చెయ్యివేసి అభినందించిన ఏపీ సీఎం

"నిన్ను నమ్మాను. నా నమ్మకాన్ని నిలబెట్టావ్. సత్తుపల్లికి నిన్ను ఎన్నికల ఇన్ చార్జ్ గా నియమించాను. ఇక్కడ టీడీపీ విజయం సాధించబోతోంది. వెల్ డన్ శ్రీనూ"... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు దక్కిన అభినందన ఇది. తెలంగాణకు జరుగుతున్న ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి నిలబడిన సండ్ర వెంకట వీరయ్యకు మద్దతుగా ఉండి, ప్రచారాన్ని పర్యవేక్షించాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు యరపతినేని అక్కడ మకాం వేశారు.

అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన తనదైన శైలిలో ప్రచారాన్ని నిత్యమూ సమీక్షిస్తూ, వ్యూహాలు నడిపారు. ఇక నిన్న సత్తుపల్లికి వచ్చిన చంద్రబాబును, హెలిప్యాడ్ వద్ద యరపతినేని కలిశారు. ఈ సందర్భంగా ఆయన భుజంపై చెయ్యి వేసి అభినందించిన చంద్రబాబు, క్షేత్ర స్థాయిలో యరపతినేని వ్యూహాలు ఫలించాయని అన్నారు.

Sattupalli
Chandrababu
Yarapatineni Srinivasarao
  • Loading...

More Telugu News