Kannada: కన్నడ నటుడు దునియా విజయ్‌ను వెంటాడుతున్న కష్టాలు.. మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన మొదటి భార్య

  • తాను బతికి ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడన్న నాగరత్న
  • భరణం, నివాసం ఇప్పించాలని ఫిర్యాదు
  • ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం

కన్నడ నటుడు దునియా విజయ్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. సెప్టెంబరు నెలలో జిమ్ ట్రైనర్ మారుతిపై దాడి చేసి జైలుకెళ్లిన ఆయనపై ఇప్పుడు మొదటి భార్య కేసు వేసింది. తాను బతికి ఉండగానే తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడంటూ మొదటి భార్య నాగరత్న మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. రెండో పెళ్లి చేసుకున్న అతడి నుంచి తనకు భరణం ఇప్పించడంతోపాటు ఉండేందుకు నివాసాన్ని కూడా ఏర్పాటు చేసేలా ఆదేశించాలని ఫిర్యాదులో కోరారు.

మారుతిపై దాడి కేసులో దునియా విజయ్ జైలుకెళ్లిన తర్వాత అతడి మొదటి భార్య నాగరత్న-రెండో భార్య కీర్తిగౌడల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో నాగరత్న కుమార్తెపై కీర్తి గౌడ అనుచరులు దాడి చేయడంలో అప్పట్లో సంచలనమైంది. తాజాగా, నాగరత్న ఫిర్యాదుతో మరోమారు విజయ్ అంశం తెరపైకి వచ్చింది. నాగరత్న చేసిన ఆరోపణలు నిజమైతే విజయ్‌కు ఏడేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉంది.

Kannada
Actor
Duniya Vijay
Maruthi Gowda
Nagarathna
Keerthi Gowda
  • Loading...

More Telugu News