Hyderabad: హైదరాబాదీలు ‘ఓటు’పై అవగాహన ఉన్న ప్రజలని ప్రపంచానికి తెలియజెప్పాలి: జీహెచ్ఎంసీ కమిషనర్

  • ‘హైదరాబాదీ’ అని ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు
  •  హైదరాబాద్ బిర్యాని గురించీ చెబుతారు
  • ‘ఓటు’ వినియోగించుకోవడంలోనూ అదే లా ఉండాలి

‘ఓటు వేయాలని చెప్పే విషయమై ప్రజలకు మీరు ఎలాంటి మెస్సేజ్ ఇవ్వదలచుకున్నారు?’ అనే ప్రశ్నకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఇక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లినా తాము ‘హైదరాబాదీ’ అని, హైదరాబాదీ బిర్యాని గురించీ ఎంత గొప్పగా చెప్పుకుంటారో, అదేవిధంగా ఓటు హక్కును వినియోగించుకునే విషయంలోనూ అదే మాదిరి ఉండాలని కోరారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే మంచి అవకాశమిదని, హైదరాబాదీలు ‘ఓటు’పై అవగాహన ఉన్న ప్రజలని ప్రపంచానికి తెలియజెప్పాలని, ఓటు వేసేందుకు ఓటర్లు ముందుకు రావాలని కోరారు. 

Hyderabad
biryani
ghmc
dana kishore
  • Loading...

More Telugu News