Chandrababu: 'ఆత్మస్తుతి పరనింద' అన్న చందంగా ఉంది టీఆర్ఎస్ తీరు: టీడీపీ నేత రావుల

  • కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుంది
  • తెలుగువారి కోసం టీడీపీ పనిచేస్తుంది
  • లగడపాటిని విమర్శించడం సరికాదు

తెలంగాణలో జరగనున్నఎన్నికల్లో ప్రజాకూటమి అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోని తెలుగువారి కోసం టీడీపీ పనిచేస్తుందన్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లన్నారు.

సర్వే చేసే హక్కు ఎవరికైనా ఉందని.. దానిని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఆత్మస్తుతి పరనింద అన్న చందంగా టీఆర్ఎస్ తీరుందని విమర్శించారు. నాడు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న కేసీఆర్.. నేడు టీడీపీని విమర్శించడం సరికాదన్నారు. నాడు సీపీఎస్ సర్వే సరైందన్న టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు లగడపాటిని విమర్శించడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.

Chandrababu
Ravula chandrasekhar Reddy
Telugudesam
TRS
KCR
  • Loading...

More Telugu News