Meizu C9: రూ.4,999 ధరకే నూతన స్మార్ట్ ఫోన్.. అమెజాన్ కొనుగోలుదారులకి మరో బంపర్ ఆఫర్!

  • భారత మార్కెట్లో విడుదలైన 'మెయ్‌జు సీ9'
  • అమెజాన్ వెబ్ సైట్లో ప్రత్యేకంగా విక్రయం 
  • జియో కస్టమర్లకి 50జీబీ డేటా

మెయ్‌జు మొబైల్ సంస్థ తాజాగా నేడు భారత మార్కెట్లో నూతన స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. పలు ఆకట్టుకునే ఫీచర్లతో కేవలం రూ.4,999 ధరకే 'మెయ్‌జు సీ9' పేరిట భారత మార్కెట్లో విడుదలైంది. అమెజాన్ వెబ్ సైట్లో ప్రత్యేకంగా లభించే ఈ ఫోన్ పై అమెజాన్ కొనుగోలుదారులు, జియో వినియోగదారులు పలు బంపర్ ఆఫర్లని పొందనున్నారు. అమెజాన్ కొనుగోలుదారులకి వోచర్ల రూపంలో రూ.2,200 లభించగా, జియో కస్టమర్లు 50 జీబీ డేటాను పొందనున్నారు.

'మెయ్‌జు సీ9' ప్రత్యేకతలు:

  • 5.45" హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే (1400 x 720 పిక్సల్స్)
  • 2 జీబీ ర్యామ్,16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం
  • 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫేస్ అన్‌లాక్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

Meizu C9
smartphone
Tech-News
technology
  • Loading...

More Telugu News