pawan kalyan: అనంతపురం జిల్లాలో ఓ ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్
- జనసేన తరంగం కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్
- ఓ ఇంటికి వెళ్లి మేనిఫెస్టోను వివరించిన వైనం
- కులమతాలకు అతీతంగా ఏపీ అభివృద్ధి చెందాలని ఆకాంక్ష
అనంతపురం జిల్లాలో 'జనసేన తరంగం' కార్యక్రమాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. జిల్లా పర్యటనలో ఉన్న గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడమే జనసేన తరంగం ఉద్దేశమని చెప్పారు. అనంతరం మర్తాడులోని ఓ ఇంటికి పవన్ వెళ్లారు. పార్టీ మేనిఫెస్టోను వివరించారు. 25 కేజీల బియ్యం కాదని... 25 ఏళ్ల భవిష్యత్తు కోసం తాను పని చేస్తున్నానని చెప్పారు. జనసేన తరంగం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కులమతాలకు అతీతంగా ఏపీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.