Chandrababu: వేదికను ఎక్కించేందుకు ఇష్టపడని అభ్యర్థికి సీటెందుకిచ్చావ్?: కేసీఆర్ కు చంద్రబాబు సూటి ప్రశ్న

  • అశ్వారావుపేటలో చంద్రబాబు రోడ్ షో
  • కేసీఆర్ పచ్చి అవకాశవాదని విమర్శలు
  • ఆయన కుటుంబానికే అభివృద్ధని విసుర్లు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సభలో అశ్వారావుపేట తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు అవమానం జరిగిందని, ఆయన్ను వేదికను ఎక్కనీయకుండా కేసీఆర్ అడ్డుకున్నారని వచ్చిన వార్తలపై స్పందించిన చంద్రబాబు, కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం అశ్వారావుపేటకు వచ్చి, ప్రజా కూటమి అభ్యర్థి మచ్చా నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేసిన చంద్రబాబు, తన సొంత పార్టీ అభ్యర్థిని వేదికను ఎక్కించేందుకు ఇష్టపడని కేసీఆర్, ఆయనకు అసలు టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

కేసీఆర్ పచ్చి అవకాశవాదని, అభివృద్ధి ఫలాలను ఆయన కుటుంబం మాత్రమే అనుభవిస్తోందని నిప్పులు చెరిగారు. తప్పుడు పనులు చేసి, నేడు రాజకీయం చేస్తూ, ప్రజలను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలకు అవసరమైనప్పుడు బయటకు రాని కేసీఆర్, ఇప్పుడు ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చారో స్పష్టం చేయాలని అన్నారు.

తాను 37 సంవత్సరాల పాటు కాంగ్రెస్ తో పోరాడానని, ఇప్పుడు దేశ క్షేమం కోసమే ఆ పార్టీతో కలిశానని, నరేంద్ర మోదీ అరాచకాలను అడ్డుకోవాలంటే, ప్రజలంతా ఏకమై రావాలని పిలుపునిచ్చారు. నిజమైన ప్రజా కూటమిని ప్రజలు గెలిపించాలని అన్నారు.

Chandrababu
Ashwarao Pet
KCR
Telangana
  • Loading...

More Telugu News