l ramana: 80 నియోజకవర్గాల్లో 6. 2 లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయి: ఈసీకి ప్రజాకూటమి నేతల ఫిర్యాదు
- రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది
- దోపిడీ చేసిన ధనంతో ఓటర్లను మభ్యపెడుతున్నారు
- ప్రజాకూటమికి వస్తున్న మద్దతును చూసి కేసీఆర్ కుటుంబం భరించలేకపోతోంది
దొడ్డి దారిన మళ్లీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రజాకూటమి అభ్యర్థులను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని అన్నారు. దోపిడీ చేసిన ధనంతో తెలంగాణ ఓటర్లను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని తెలిపారు.
పోలీసుల అండతో ప్రజాకూటమి నేతలను భయపెట్టాలని చూస్తున్నారని... అలాంటి వాటికి తాము భయపడబోమని, ప్రజల మద్దతుతో ఎన్నికలకు వెళతామని చెప్పారు. 80 నియోజకవర్గాల్లో 6. 2 లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయని... ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎన్నికల సంఘాన్ని ఈరోజు మహాకూటమి నేతలు కలిశారు. ఈ సందర్భంగా బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేశారు. ప్రజాకూటమికి వస్తున్న ప్రజా మద్దతును చూసి కేసీఆర్ కుటుంబం భరించలేకపోతోందని అన్నారు.