kcr: ప్రజలకు చెప్పడం నా బాధ్యత కనుక చెబుతున్నా: సీఎం కేసీఆర్

  • ‘కాంగ్రెస్’ ని కనుక గెలిపిస్తే మళ్లీ పాత పరిస్థితులొస్తాయి
  • ఈ జిల్లాను చంద్రబాబు నాడు దత్తత తీసుకున్నాడు
  • పాలమూరు ఎత్తిపోతలను చంద్రబాబు వద్దన్నాడు

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కనుక గెలిపిస్తే తెలంగాణలో మళ్లీ పాత పరిస్థితులు వస్తాయని, రాష్ట్రం అంధకారమయం అవుతుందని, ప్రజలకు చెప్పడం తన బాధ్యత కనుక చెబుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లో నిర్వహిస్తున్న ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ జిల్లాను నాడు తొమ్మిదేళ్ల పాటు దత్తత తీసుకున్న చంద్రబాబు ఒరగబెట్టిందేమీ లేదని, తమ హయాంలో ముందుకు తీసుకెళ్లామని అన్నారు.

జూరాల ప్రాజెక్టుకు పై నుంచి నీరు రాకపోయినా భయపడాల్సిన పనిలేదని, శ్రీశైలం ప్రాజెక్టులోని డెడ్ స్టోరేజ్ ద్వారా నీళ్లు తీసుకుంటున్నామని, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కూడా నీళ్లు వస్తాయని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వద్దన్న చంద్రబాబు, తమ అభ్యర్థిని ఇక్కడ నిలబెడతాడా? ఈ కాంగ్రెస్ దద్దమ్మలు ఏ విధంగా టీడీపీకి సపోర్టు చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News